: రాజ్యసభ ఎన్నికల బరి నుంచి నేను తప్పుకోలేదు: ఆదాల
రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేసిన చైతన్యరాజు పోటీ నుంచి తప్పుకున్నానని ప్రకటించడం, ఆ వెంటనే ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా వెనక్కి తగ్గారని మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి. అనూహ్యంగా.. తాను బరిలో ఉన్నానని రిటర్నింగ్ అధికారికి ఆదాల ఫోనులో చెప్పినట్లు సమాచారం. అంతకుముందు తను ఉపసంహరించుకున్నానని వెంకట్రామయ్య ఇచ్చిన లేఖతో తనకు సంబంధంలేదని ఆదాల చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, తనను తప్పుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారని.. ఆయన సూచనను పరిశీలిస్తానని మాత్రమే చెప్పానని ఆయన అన్నారు. తనపై నాలుగు రోజులుగా కుట్ర జరుగుతోందని ఆదాల వ్యాఖ్యానించారు.