: కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం!
రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి సుబ్బరామిరెడ్డి, ఎంఏ ఖాన్, కేవీపీ రామచంద్రరావు.. టీడీపీ నుంచి గరికపాటి మోహన్ రావు, తోట సీతారామలక్ష్మి.. టీఆర్ఎస్ నుంచి కేశవరావు పోటీలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేసిన చైతన్యరాజు కొంతసేపటికి కిందట ఉపసంహరించుకోవడంతో వారి ఎన్నిక అనధికారికంగా ఖరారైంది. ఇంకా ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి ప్రకటించాల్సి ఉంది.