: బీజేపీలో చేరనున్న బప్పీలహరి?
ఎన్నికలకు ముందు సెలబ్రిటీలను ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. గాయకుడు, సంగీత దర్శకుడు బప్పీలహరి ఈ రోజు సాయంత్రం బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బీజేపీ వర్గాలు తెలిపాయి. దీనిపై బప్పీలహరి మాత్రం ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఈయన కోల్ కతా జన్మస్థలం. ముంబైలో స్థిరపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేక దేశవ్యాప్త ప్రచారానికే పరిమితమవుతారా? అన్నది స్పష్టత లేదు. వచ్చే రెండు నెలల కాలంలో బీజేపీ మరింత మంది సెలబ్రిటీలను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తోంది.