: మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం: డిగ్గీరాజా
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ సీమాంధ్రుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని.. వారి సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. హైదరాబాద్ పదేళ్లు ఇరు ప్రాంతాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని తెలిపారు.