: 'పద్మభూషణ్' తిరస్కరించిన జస్టిస్ వర్మ కుటుంబం
దివంగత జస్టిస్ జేఎన్ వర్మకు ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 'పద్మభూషణ్' అవార్డును ఆయన కుటుంబం తిరస్కరించింది. జస్టిస్ వర్మ అవార్డుల కోసం ఎప్పుడూ పాకులాడలేదని, ఆయనకు అవార్డు వచ్చినట్టు ప్రభుత్వం తమకు అధికారకంగా తెలియజేయలేదని, మీడియా ద్వారానే తమకు తెలిసిన కారణంగా తాము జస్టిస్ వర్మ తరపున అవార్డు స్వీకరించలేమని స్పష్టం చేస్తూ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి జస్టిస్ వర్మ కుటుంబ సభ్యులు లేఖ రాశారు.
అవార్డు ఇస్తున్నట్టు తమకు ప్రభుత్వం అధికారికంగా ముందే తెలిపి ఉంటే బాగుండేదని వారు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో నిర్భయ ఘటన అనంతరం మహిళలపై అత్యాచారాలు నిరోధించే కఠినమైన చట్టాలు రూపొందించేందుకు ప్రభుత్వం వేసిన కమిటీకి జస్టిస్ వర్మ అధ్యక్షత వహించిన సంగతి తెలిసిందే. ఆయన మరణానంతరం ప్రభుత్వం 'పద్మభూషన్' అవార్డు ప్రకటించింది.