: తెలుగు జాతికి అన్యాయం జరిగితే సహించేది లేదు: చంద్రబాబు


విభజన బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని చంద్రబాబు చెప్పారు. ఆర్థిక వివరణలు, విభజన అంశాలు బిల్లులో పొందుపర్చకుండానే.. ముసాయిదా బిల్లును చర్చకు పెట్టారని చంద్రబాబు వెల్లడించారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బిల్లుపై చర్చ పూర్తవగానే.. అక్కడ ఢిల్లీలో దిగ్విజయ్ బిల్లుపై చర్చకు, తీర్మానానికి సంబంధం లేదని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. కావాలనే కాంగ్రెస్ గందరగోళ పరిస్థితిని కలుగజేస్తోందని దీన్ని బట్టి తెలుస్తోందన్నారు. విభజన అంశంలో భాగస్వామి అయిన కిరణ్ సమైక్య హీరో ఎలా అవుతాడని చంద్రబాబు ప్రశ్నించారు.

విభజన అంశాన్ని కాంగ్రెస్ మరింత జటిలం చేస్తోందని, రాష్ట్రాన్ని కాకుండా తెలుగు ప్రజలను విడగొట్టేందుకే కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని చంద్రబాబు చెప్పారు. తెలుగు జాతికి అన్యాయం జరిగితే సహించేది లేదని చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్రపై రాష్ట్రపతి, జాతీయ నేతలను కలిసి వివరిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పుడల్లా.. దాని ఫలితాన్ని అనుభవించిందని, వచ్చే ఎన్నికల్లో అదే జరుగుతుందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News