: హజ్ యాత్రకు 1.7 లక్షల మంది భారతీయులు


ముస్లింలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించుకునే పవిత్ర క్షేత్రం మక్కా. భారత్.. హజ్ యాత్ర పేరిట ప్రతి ఏడాది మక్కా యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ ఏడాది భారత్ నుంచి 1.7 లక్షల మంది మక్కాను సందర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సౌదీ అరేబియా వర్గాలు వెల్లడించాయి.

అయితే, అదనంగా మరో 10,000 మంది హజ్ ను సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని భారత్.. సౌదీని కోరింది. ఈమేరకు భారత్ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ఇ. అహ్మద్.. సౌదీ హజ్ వ్యవహారాల మంత్రి బందార్ బిన్ మహ్మద్ అల్ హజ్జార్ తో ఆదివారం సమావేశమయ్యారు.

హజ్ యాత్ర సందర్భంగా భారత యాత్రికులకు కల్పించాల్సిన సౌకర్యాల పట్ల వారిరువురు చర్చించారు. కాగా, మరో 10,000 మందికి అవకాశం కల్పించాలని భారత్.. సౌదీ వర్గాలను కోరిన నేపథ్యంలో హజ్ యాత్రకు ఈసారి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News