: కులాలు, మతాల వారీగా విభజించి బీజేపీ లబ్ది పొందాలని చూస్తోంది: సోనియా గాంధీ


సమాజాన్ని కులాలు, మతాల వారీగా విభజించి బీజేపీ లబ్ది పొందాలని చూస్తోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విమర్శించారు. బీహార్ లోని కిషన్ గంజ్ లో అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బీజేపీ దేశ వ్యాప్తంగా మత విద్వేషాలు రగిల్చే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. జాతిపిత మహాత్మా గాంధీ ప్రబోధించిన మత సామరస్యం, సౌభ్రాతృత్వానికి తీరని చేటు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ లౌకికవాదానికి కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. గత పదేళ్లలో బీహార్ ప్రజల సంక్షేమానికి యూపీఏ ప్రభుత్వం 1.34 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందని వెల్లడించారు. కాగా, ఆమె ప్రసంగిస్తుండగా జేడీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలివ్వడంతో పాటు, కుర్చీలు విసిరేశారు.

  • Loading...

More Telugu News