: కేసీఆర్ తానే కేంద్ర ప్రభుత్వంలా మాట్లాడుతున్నారు: దేవినేని ఉమ


తానే కేంద్ర పభుత్వమైనట్టుగా కేసీఆర్ మాట్లాడుతున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర నేతలు, ప్రజలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలని ఖండిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ అన్నీ తానే చేస్తున్నట్టు చెబుతారని, జనాలను మభ్యపెట్టడానికి అదో మార్గమని ఆయన తెలిపారు. కేసీఆర్ కి అన్నీ తెలిస్తే అన్ని డెడ్ లైన్లు పెట్టినా రాష్ట్రం ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కేసీఆర్ కి ఏదో ఒకటి మాట్లాడడం అలవాటని దేవినేని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News