: సీమాంధ్ర నేతలది శునకానందం: కేసీఆర్
తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి హైదరాబాద్ అంకం పూర్తయిందని... ఇకపై అంతా ఢిల్లీలోనే ఉందని కేసీఆర్ అన్నారు. మెజార్టీ అభిప్రాయం అంటున్నారని... మెజారీటీ కోసం చూస్తే దేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా ఏర్పాటు కాదని తెలిపారు. సీమాంధ్ర నేతలు తాము ఏదో సాధించామని అనుకుంటున్నారని... వారిది శునకానందమని ఎద్దేవా చేశారు. ఈ రోజు ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీకి కేవలం అభిప్రాయాలు తెలిపే అవకాశం మాత్రమే ఉందని... శాసించే అధికారం లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కచ్చితంగా జరుగుతుందని... ఏ రాష్ట్రమైనా ఏర్పాటయ్యే సందర్భంలో ఇలాగే జరుగుతుందని చెప్పారు. ఈ వ్యవహారంలో ఒకరు ఓడటం, మరొకరు గెలవడం లాంటివి ఉండవన్నారు.