: పాఠశాలల్లో సాంస్కృతిక విద్యకు శ్రీకారం


ఇప్పటికే సిలబస్ భారంతో ఒత్తిడికి లోనవుతున్న పాఠశాల విద్యార్ధులకు కొత్తగా మరో పాఠ్యాంశం వచ్చి చేరుతోంది. ఏడో సబ్జెక్టుగా సాంస్కృతిక విద్యను తప్పనిసరి చేసే దిశగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, నాటకం అనే నాలుగు అంశాలలో బోధన జరుగుతుంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు ఈ పాఠ్యాంశాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు జరిపేలా సన్నాహాలు చేస్తున్నారు. సాంస్కృతిక రంగంపై అవగాహన, ఆసక్తి కలిగించే ఉద్దేశంతో నిపుణుల సలహాపై ఈ విద్యకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.  

  • Loading...

More Telugu News