: విజయవాడలో అంబరాన్నంటిన సంబరాలు
శాసనసభ, శాసనమండలిలో రాష్ట్ర విభజన బిల్లు తిరస్కారానికి గురవడంతో సీమాంధ్ర ప్రజలు సంతోషంలో మునిగిపోయారు. బిల్లును అసెంబ్లీ తిరస్కరించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తున్నారు. టీబిల్లును అసెంబ్లీ తిప్పి కొట్టిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని న్యాయవాదులు సూచించారు.