: బిల్లుపై అసెంబ్లీలో చర్చ పూర్తయింది: జూపల్లి కృష్ణారావు
ముసాయిదా బిల్లుపై చర్చించి శాసనసభ అభిప్రాయం మాత్రమే చెప్పాలని కేంద్రం బిల్లును పంపిందని తెలంగాణ రాష్ట్ర సమితి నేత జూపల్లి కృష్ణారావు చెప్పారు. దీనిపై అసెంబ్లీలో చర్చ జరిగిందని, సభ్యులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసారని ఆయన అన్నారు. అయితే, బిల్లుపై ఓటింగ్ జరిపే అర్హత అసెంబ్లీకి లేదని ఆయన తేల్చి చెప్పారు. ముసాయిదా బిల్లు రాష్ట్రపతికి పంపారని, బిల్లుపై పార్లమెంట్ ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకుంటుందని జూపల్లి ఆశాభావం వ్యక్తం చేసారు.