: సినిమాకు, ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు: 'నమో' సినీ దర్శకుడు
'నమో' సినిమాకు, ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని ఆ సినిమా దర్శకుడు రూపేశ్ పాల్ చెబుతున్నారు. ఈ సినిమా గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ జీవిత చరిత్ర కాదని, ఆయన జీవితంలో కొన్ని ఘట్టాలను స్ఫూర్తిగా తీసుకుని నిర్మిస్తున్న సినిమా అని ఆయన తెలిపారు. ఈ సినిమాకి ఏ రాజకీయ పార్టీ నిధులు సమకూర్చలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఈ సినిమాపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.