: నా మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోనే ఉండాలని కోరుకుంటున్నా: మధుయాష్కీ


తన మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోనే ఉండాలని తాను కోరుకుంటున్నానని ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన బిల్లు ఈ సమావేశాల్లోనే ఆమోదం పొందుతుందని అన్నారు. సీమాంధ్ర నేతలకు ప్రజాస్వామ్యం, విలువల గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. రాష్ట్రపతి మరో వారం రోజుల గడువు పెంచితే పెంచొచ్చని ఆయన తెలిపారు. అయినప్పటికీ తెలంగాణ బిల్లు ఆమోదానికి వచ్చే నష్టమేదీ లేదని మధుయాష్కీ తెలిపారు. ఇచ్చిన గడువు ఉపయోగించుకోకుండా గడువు పెంచాలని గగ్గోలు పెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News