: నార్సింగి పీఎస్ ఎదుట ఏఏపీ కార్యకర్తల ధర్నా
చిన్నారి యశ్ రాజ్ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏఫీ) కార్యకర్తలు నార్సింగి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. చిన్నారులపై అఘాయిత్యాలను కట్టడి చేయాలంటూ ఏఏపీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో పోలీసులు పెట్రోలింగ్ ను పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఆరేళ్ల బాలుడు యశ్ రాజ్ హత్య కేసులో పోలీసులు నిందితులను ఇంతకు ముందే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.