: ఖలిస్థాన్ తీవ్రవాది భుల్లార్ కు క్షమాభిక్ష కోరిన కేజ్రీవాల్
మరణశిక్ష ఎదుర్కొంటున్న ఖలిస్థాన్ తీవ్రవాది దేవేందర్ పాల్ సింగ్ భుల్లార్ కు క్షమాభిక్ష పెట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఈ మేరకు రాష్ట్రపతికి ఆయనో లేఖ రాశారు. 1993, సెప్టెంబర్ లో చోటు చేసుకున్న కారు బాంబు పేలుళ్లలో తొమ్మిది మంది మరణించారు. ఈ కేసులో భుల్లార్ కు మరణశిక్ష పడింది. అప్పటినుంచి పలుమార్లు తను శిక్షపై రివ్యూ పిటిషన్లు, రాష్ట్రపతికి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. తాజాగా, మరణశిక్ష ఖైదీలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించడంతో పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ ను కోర్టు నిన్ననే విచారణకు స్వీకరించింది.