: విభజన ప్రక్రియను బీజేపీ మాత్రమే ఆపగలదు: సబ్బం హరి
రాష్ట్ర విభజన ప్రక్రియను ఆపగల పార్టీ బీజేపీ ఒక్కటేనని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియలో రాష్ట్రంలో అన్ని పార్టీలు మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వల్లే విభజన ప్రక్రియ ఆలస్యమైందని విజయవాడలో సబ్బం వ్యాఖ్యానించారు. అటు కాంగ్రెస్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి కాంగ్రెస్ నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ కు వంద సీట్లు కూడా రావని, రాజకీయ లబ్ది కోసమే విభజన అని అన్నారు.