: రాజ్యసభ రిటర్నింగ్ అధికారిని కలిసిన బొత్స, కొండ్రు మురళి
రాజ్యసభ రిటర్నింగ్ అధికారి సదారాంను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి కొండ్రు మురళి కలిశారు. స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలోకి దిగిన వారికి ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణకు సంబంధించిన అంశంపై వీరు సదారాంతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. స్వతంత్ర అభ్యర్ధులకు ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరణ లేఖలు ఇచ్చిన విషయాన్ని ఆయనకు బొత్స లిఖితపూర్వకంగా తెలిపారు.