: వందకోట్ల క్లబ్బులో సల్మాన్ 'జై హో'!


సల్మాన్ ఖాన్ నటించిన 'జై హో' చిత్రం ప్రపంచవ్యాప్త వసూళ్లతో వందకోట్ల క్లబ్బులో చేరింది. దేశీయ మార్కెట్ లో తొలి మూడు రోజులకు రూ.78.90 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం, ఓవర్ సీస్ ద్వారా రూ.22.36 (3.55 మిలియన్ డాలర్లు) కోట్లు వసూలు చేసింది. మొత్తం కలిపి వందకోట్ల మార్కును దాటేందుకు సహాయం చేసింది. ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్, సొహైల్ ఖాన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న ప్రపంచ వ్యాప్తంగా ఐదువేల థియేటర్లలో విడుదలైంది. మొదట సినిమా చూసిన అందరూ అంతగా మార్కెట్ చేయకపోవచ్చని భావించినా నెమ్మదిగా పుంజుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News