: స్నేహా ఉల్లాల్ కు సల్మాన్ సలహా
నటి స్నేహా ఉల్లాల్ కు ఇటీవలే సల్మాన్ ఖాన్ ఒక సలహా ఇచ్చాడు. సీసీఎల్ మ్యాచ్ సందర్భంగా సల్మాన్ స్నేహను కలుసుకున్నాడు. జిమ్ కు వెళ్లాలని సూచించాడు. అంతేకాదు, మళ్లీ మంచి శరీరాకృతి కోసం బెల్లీ డ్యాన్స్ నేర్చుకోవాలని కూడా సలహా ఇచ్చాడు. మరోసారి తన లక్కును పరీక్షించుకోవాలని స్నేహ.. సల్మాన్ సూచనలను తూచ తప్పకుండా ఆచరణలో పెట్టేసిందట. అయితే, మాజీ ప్రియురాలు ఐశ్వర్యారాయ్ సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్ధం అవుతున్నట్లు తెలిసే, సల్మాన్ స్నేహను రంగంలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు కొందరు భావిస్తున్నారు. స్నేహ ఐశ్వర్యను పోలినట్లు ఉంటుందని తెలిసిందే.