: చైతన్యరాజు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ సంతకం చేస్తే చర్యలే: బొత్స
రాజ్యసభ అభ్యర్థిత్వానికి చైతన్యరాజు బీ ఫామ్ దరఖాస్తు చేసిన నేపథ్యంలో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైతన్యరాజుకు మద్దతు తెలుపుతూ సంతకాలు చేసిన నేతలందరిపైనా చర్యలు తీసుకుంటామని బొత్స స్పష్టం చేశారు. దీనిపై చైతన్య రాజు స్పందిస్తూ సమైక్యాంధ్రకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే తాను పోటీనుంచి తప్పుకుంటానని అన్నారు. సమైక్యవాదం తీవ్రత తెలియజెప్పేందుకే తాను బరిలో నిలిచానని, తనకు 30 మంది కాంగ్రెస్ నేతల మద్దతు ఉందని ఆయన స్పష్టం చేశారు.