: భద్రాచలం ముమ్మాటికీ సీమాంధ్రదే: కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్
భద్రాచలం డివిజన్ ముమ్మాటికీ సీమాంధ్ర ప్రాంతానికి చెందినదేనని కేంద్ర గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి కిషోర్ చంద్రదేవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ భద్రాచలం సీమాంధ్ర ప్రాంతానికి చెందినదేనని చెప్పేందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అయితే, తెలంగాణ ముసాయిదా బిల్లును వెనక్కి పంపడం సరికాదని ఆయన అన్నారు. బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిపి మార్పులు చేయాలని ఆయన సూచించారు. కొండ కుమ్మరులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రతిపాదనలు పంపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.