: రాజ్యసభకు చైతన్యరాజు నామినేషన్.. విరమించుకున్న జేసీ
రాజ్యసభ రెబల్ అభ్యర్థిగా చైతన్యరాజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు రెండు జతల పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అటు కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి రాజ్యసభ పోటీ నుంచి వెనక్కి తగ్గారు. తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు జేసీ తెలిపారు. పార్టీ అధిష్ఠానం ఆయన్ను ఎంపిక చేయకపోయినా పోటీచేసి తీరుతానని చెప్పిన జేసీ ఇప్పుడు విరమించుకోవడం గమనార్హం.