: సలహాలివ్వడానికి జైరాం రమేష్ ఎవరు?: ధూళిపాళ్ల
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కేంద్ర మంత్రి జైరాం రమేష్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విభజన బిల్లుపై సభలో ఏం మాట్లాడాలో మార్గనిర్దేశం చేయడానికి జైరాం రమేష్ ఎవరని ప్రశ్నించారు. శాసనసభతో సంబంధం లేనివారు సభా వ్యవహారాల్లో తల దూర్చడం మంచి పద్దతి కాదని అన్నారు. ఇది సభా హక్కులకు భంగం కలిగించడమే అని తెలిపారు. ఈ రోజు అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ, ధూళిపాళ్ల ఈ వ్యాఖ్యలు చేశారు.