సినీ దర్శకుడు బీరం మస్తాన్ రావు(69) చెన్నైలో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడ్డారు. బుర్రిపాలెం బుల్లోడు, గయ్యాళి గంగమ్మ, విప్లవ శంఖం సహా పలు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.