: రాజ్యసభ నామినేషన్లకు తుదిగడువు నేడే
రాజ్యసభ నామినేషన్లకు ఈ రోజే తుదిగడువు కావడంతో, రాష్ట్రం నుంచి జరగనున్న ఆరు రాజ్యసభ సీట్లకు నామినేషన్లు దాఖలు కానున్నాయి. కాంగ్రెస్ నుంచి తిరుగుబాటు అభ్యర్ధులుగా ఉన్నవారు కూడా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. మొత్తం 35 వరకూ నామినేషన్ల దరఖాస్తు ఫారాలను పలువురు కొనుగోలు చేశారు. రాష్ట్రమంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, చైతన్యరాజు, ఆదాల ప్రభాకరరెడ్డి తదితరులు నామినేషన్లు కొనుగోలు చేసిన వారిలో ఉన్నారు.