: ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం సరైనదే: కేంద్ర మంత్రి పళ్లంరాజు
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును తిప్పి పంపాలంటూ నోటీసిచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కేంద్ర మంత్రి పళ్లంరాజు అభినందించారు. సీఎం తీసుకున్న నిర్ణయం సరైందే అన్నారు. ఈ రోజు కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ, బిల్లులో లోపాలున్నాయని తాము ముందుగానే అధిష్ఠానంతో చెప్పామని... అయినప్పటికీ తమను పట్టించుకోలేదని తెలిపారు. పార్లమెంటులో బిల్లును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.