: పెద్దల సభకు పోటీ చేస్తా: ఉండవల్లి
రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నట్టు రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు. తనకు సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు మద్దతివ్వాలని ఆయన కోరారు. ‘సమైక్య ఎంపీ’గా బరిలో దిగాలని ఆయన భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం నోటీసులిచ్చిన ఎంపీల్లో ఒకరిని రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయించాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు యోచిస్తున్నారు.