: ఓటింగ్ పై ప్రకటన చేయాలని కోరాం: పయ్యావుల


స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో భేటీ అయిన తర్వాత సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. బిల్లుపై సభలో కచ్చితంగా ఓటింగ్ నిర్వహించాలని తాము స్పీకర్ ను కోరామని పయ్యావుల కేశవ్ తెలిపారు. తమ విజ్ఞప్తికి స్పీకర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. అయితే, దీనికి సంబంధించి ఈ రోజే సభలో ప్రకటన చేయాల్సిందిగా కోరామని తెలిపారు. శాసనసభ నిబంధనల ప్రకారం ప్రతి సభ్యుడికి తమ అభిప్రాయాలను వెలిబుచ్చే అవకాశం ఉందని చెప్పామన్నారు.

  • Loading...

More Telugu News