: ముఖ్యమంత్రి నిర్ణయం భేష్.. బిల్లును వెనక్కి పంపించాలని టీడీపీ పోరాడింది: ధూళిపాళ్ల


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లును వెనక్కి తిప్పి పంపాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం అని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అభినందించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర శాసనసభకు బిల్లు వచ్చిన నాటి నుంచి తప్పుల తడకగా ఉందంటూ టీడీపీ మాత్రమే పోరాడుతోందని అన్నారు. సీఎం ఇచ్చిన నోటీసుపై రేపు స్పీకర్ తీర్మానాన్ని ప్రవేశపెడితే దానిని గెలిపిస్తూ సమైక్యవాదులంతా ఓటింగ్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అప్పుడు వైఎస్సార్సీపీ అసలు రంగు బయట పడుతుందని ఆయన తెలిపారు. బిల్లు శాసనసభకు వచ్చిన నాటి నుంచి విభజనకు అనుకూలంగా సభను బహిష్కరిస్తున్న వైఎస్సార్సీపీ ఏం చేస్తుందో చూడాలని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News