: హార్ట్ బీట్ తో సెల్ ఫోన్ ఛార్జింగ్..!


ఒకప్పుడు యాంటెన్నాతో ఉండే మొబైల్ ఫోన్లు ఉండేవి. ఆ తరువాత, ఇంటర్నెల్ యాంటెన్నాతో ఉండే సెల్ ఫోన్లు వచ్చాయి. మరిప్పుడు చేతిలో ఇమిడిపోయే ఫోన్లు, స్మార్ట్ ఫోన్ల హవా కొనసాగుతున్న కాలంలో ఛార్జర్ల కోసం ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఆ ఇబ్బందిని కూడా అధిగమించి.. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఛార్జ్ చేసుకునే వీలున్న పవర్ బ్యాంకుల్ని వాడుతున్నాం. ఇప్పుడు మరిన్ని సరికొత్త ఆవిష్కరణల కోసం అమెరికా, చైనా దేశాల శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేస్తోంది. ఆ పరిశోధనల్లో వారు విజయం సాధించారు. మన గుండె, ఊపిరితిత్తులు, డయాఫ్రమ్ వంటి వాటి కదలికల సందర్భంగా ఉత్పన్నమయ్యే శక్తితో ఫేస్ మేకర్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఛార్జ్ అయ్యే సరికొత్త పట్టీని పరిశోధకులు రూపొందించారు. ఈ పరికరంతో మొబైల్ ఫోన్లనూ ఛార్జ్ చేసుకోవచ్చని వారు చెబుతున్నారు. వీటిని శరీరంపై అమర్చి, ఫోన్లు, టాబ్లెట్ పీసీల వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుసంధానిస్తే చాలు. మనమే ఓ నడిచే పవర్ బ్యాంక్ గా మారిపోయి ‘ఛార్జ్’ రోజులు మరింకెంతో దూరంలో లేవు.

  • Loading...

More Telugu News