: కాంగ్రెస్ మా పోస్టర్ కాపీ కొట్టింది: బీజేపీ


పోస్టర్ చూసి సినిమా ఎలా ఉంటుందో అంచనా వేస్తాం. పోస్టర్లో విషయం ఎంత బాగుంటే.. సినిమా కూడా అంత బాగుంటుందని చాలా మంది అనుకుంటారు. కాంగ్రెస్ పార్టీ కూడా సరిగ్గా ఇలాగే అనుకొన్నట్లుంది. ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్లు అంతగా కలిసి రాలేదని భావించిన కాంగ్రెస్.. వెంటనే కొత్త పోస్టర్ ను రూపొందించింది. ‘నేను కాదు మనం’ అంటూ రాహుల్ గాంధీ ఫోటోతో ఉన్న ఈ పోస్టర్లు తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో విడుదలయ్యాయి. ‘విడగొట్టొద్దు.. కలిసుందాం’ అనే నినాదంతో ఏర్పాటు చేసిన కొత్త పోస్టర్లు ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ పోస్టర్ పై అప్పుడే విమర్శలు కూడా వినవస్తున్నాయి. ఈ పోస్టర్ తమను చూసి కాపీ కొట్టారని భారతీయ జనతా పార్టీ మండిపడుతోంది. గతంలోనే తాము నరేంద్ర మోడీ ముఖ చిత్రంతో ఆ పోస్టర్ ను విడుదల చేశామని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దానినే కాపీ కొట్టేసిందని ఆ పార్టీ చెబుతోంది.

  • Loading...

More Telugu News