: టీవీ ఛానళ్లలో సమైక్యాంధ్ర ప్రచారం బంద్


టీవీ ఛానళ్లలో సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రచార ప్రకటనలను ఉపసంహరించుకోవాలని సమైక్యాంధ్రవాదులు నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో తన ప్రసంగం ప్రారంభించే సమయానికి తెలంగాణ బిల్లుపై సీమాంధ్ర ప్రజలు నిరసనలు తెలిపేలా ప్రభావితం చేయడంలో అవి విఫలమయ్యాయి. దాంతో టీవీ ఛానళ్లలో ప్రచార ప్రకటనలు నిలిపివేయాలని స్పాన్సర్లు నిర్ణయించుకున్నారు. అయితే సంబంధిత యాడ్ ఏజెన్సీలతో కనీసం నెల రోజుల ఒప్పందం కుదుర్చుకున్న కారణంగా సీమాంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేసిన హోర్డింగులను మాత్రం మరికొన్ని రోజులు ఉంచుతారు.

  • Loading...

More Telugu News