: పేరెంట్స్ కంటే పిల్లలే చాకులు!


పెద్దలు పిల్లలకు మాటలు నేర్పుతారు.. బుడి బుడి అడుగులతో మొదలుపెట్టించి, పెద్ద పెద్ద అడుగులు వేయించే దిశగా వారిని మలుస్తారు. కానీ, అంతా పెద్దలేనా.. పిల్లలు కూడా పెద్దలకు నేర్పేవి ఉన్నాయండోయ్. ముఖ్యంగా మొబైల్ గేమ్స్ లో పిల్లలకు మరెవరూ పోటీ రాలేరు. ప్రపంచవ్యాప్తంగా 40 శాతం తల్లిదండ్రులు మొబైల్ గేమ్స్ ఎలా ఆడాలో తమ పిల్లల నుంచి నేర్చుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే, దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాల్లోని తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి కంప్యూటర్, నెట్ ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటున్నారు. శాంటియాగో, చీలీ పరిశోధకుల అధ్యయనంలో ఇది వెల్లడైంది. టెక్నాలజీ విషయంలో పెద్దలపై వారి పిల్లల ప్రభావం ఏ మేరకు ఉందన్న దానిపై వీరు అధ్యయనం చేశారు. స్కూల్ కు వెళ్లే చిన్నారులు.. తోటి వారి నుంచి నేర్చుకున్న టెక్నాలజీని తమ పెద్దవారికి బోధిస్తున్నారట.

  • Loading...

More Telugu News