: శాంతిభద్రతల సమస్య వస్తే.. ఇక్కడకు 25 వేలమంది పోలీసులొచ్చారు: సీఎం కిరణ్


హైదరాబాదు మతపరంగా చాలా సున్నితమైన నగరమనీ, మత కల్లోలాల్లో గత 35 ఏళ్లుగా ఇక్కడ 400 మంది చనిపోయారని సీఎం కిరణ్ చెప్పారు. మత కల్లోలాల్లో 3,500 మంది వరకు గాయాల పాలయ్యారని ఆయన తెలిపారు. శాంతి భద్రతల సమస్య ఎదురైనప్పుడు.. ఇక్కడ మత ఘర్షణలు జరిగినప్పుడు సీమాంధ్ర ప్రాంతం నుంచి 25 వేల మంది పోలీసు బలగాలను రప్పిస్తున్నామని ఆయన చెప్పారు. హైదరాబాదులో ఏ చిన్న ఘర్షణ జరిగినా, రాష్ట్ర ప్రజలందరూ సునిశితంగా చూస్తున్నారని, తమ ఆత్మీయులు ఇక్కడ ఉన్నారు కనుకనే ఇంతగా గమనిస్తున్నారని సీఎం కిరణ్ అన్నారు.

  • Loading...

More Telugu News