: నగ్న చిత్రాలు దొంగిలించి.. వెబ్ సైట్లో పెట్టిన ఇద్దరి అరెస్ట్


వారిద్దరూ మనుషులే. కానీ, నైతిక విలువలను ఖూనీ చేసి తప్పుడు పనులకు పాల్పడ్డారు. ఒకరి పేరు హంట్ మూరే(27). నీలి చిత్రాల వెబ్ సైట్ isanyoneup.com నిర్వాహకుడు. ఇప్పుడిది మూతపడింది. నగ్న చిత్రాలు, వీడియోలను మూరే తన సైట్లో అక్రమంగా అప్ లోడ్ చేసేవాడు. ప్రేమ విచ్ఛిన్నమైన వారు.. వారి మాజీ ప్రియులకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను తన సైట్ లో పోస్ట్ చేసేలా ప్రోత్సహించేవాడు. వారి పేర్లను కూడా సైట్ లో పెట్టేవాడు. ఇలా అమెరికాలో ఒక ప్రముఖ వ్యక్తి కూమార్తె, అమెరికన్ ఐడల్ ఫైనలిస్ట్ కూడా అయిన యువతి నగ్న చిత్రాలను కూడా బహిరంగ పరిచాడు. ఇతడికి చార్లెస్ ఈవెన్స్(25) తనవంతు సహకరించాడు. వ్యక్తుల ఈ మెయిళ్లను హ్యాక్ చేసి వారి మెయిల్స్ లో ఉన్న నగ్న చిత్రాలను తస్కరించి తీసుకొచ్చి మూరే వెబ్ సైట్లో పెట్టేవాడు. మూరేను వుడ్ ల్యాండ్ లో, ఈవెన్స్ ను లాస్ ఏంజలస్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో నేరం రుజువైతే ఐదేళ్ల జైలు శిక్ష పడుతుంది.

  • Loading...

More Telugu News