: ఇంకా గడువు పెంచాలని ఆశించడం సరికాదు: జూలకంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై చర్చకు మరింత సమయం ఆశించడం సరికాదని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి సూచించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే వారం రోజుల గడువును రాష్ట్రపతి పెంచారని, మరిన్ని రోజులు అదనంగా కోరడం సమంజసం కాదని అన్నారు. ఉన్న సమయంలోనే చర్చ ముగిసేలా చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్, డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న ఒప్పంద లెక్చరర్ల సర్వీసులను క్రమబద్దీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.