: తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించింది ఎన్టీఆరే: రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించింది దివంగత నందమూరి తారకరామారావేనని తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శాసనసభలో విభజన బిల్లుపై చర్చ సందర్భంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలను బాధల నుంచి విముక్తి కల్పించడం కోసమే ఎన్టీఆర్ పార్టీ పెట్టారని చెప్పారు. ఎన్టీఆర్ మానవతావాదే కానీ, సమైక్యవాది, తెలంగాణ వాది కాదన్నారు. 610 జీవో ఇచ్చింది ఎన్టీఆరే అని చెప్పారు. కేసీఆర్, ఎర్రబెల్లి, బాలయోగి, ఎర్రన్నాయుడు, యనమల, దేవేందర్ గౌడ్, తుమ్మల నాగేశ్వరరావు లాంటి వారందరూ ఎన్టీఆర్ నాయకత్వం నుంచి వచ్చినవారేనన్నారు. ఎన్టీఆర్ పేదల పక్షపాతి అని, సమస్య ఉన్న ప్రతీ ప్రాంతం తనదేనని అనేవారని చెప్పారు.