: గుంటూరు జోన్ లో ఆంధ్రాబ్యాంక్ రూ.7820 కోట్ల వ్యాపారం
గుంటూరు జోన్‌లో 2013, డిసెంబర్ నెలాఖరు నాటికి ఆంధ్రాబ్యాంక్ రూ.7820 కోట్ల వ్యాపారం చేసిందని ఆంధ్రాబ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ వీఎం పార్థసారథి చెప్పారు. గుంటూరు ఆటోనగర్‌లో నూతన బ్రాంచిని ప్రారంభించిన సందర్భంగా జోనల్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. రూ.2189 కోట్లను వ్యవసాయ రంగానికి, రూ.1884 కోట్లను వర్తక, వాణిజ్య రంగాలకు, రూ.731 కోట్లను గృహ, విద్యారంగాలకు రుణాలు కేటాయించామని ఆయన తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఏబీ జీవన్ అభయ్ ప్లస్’ సేవింగ్స్ డిపాజిట్ స్కీంలో నామమాత్రపు ప్రీమియంతో రూ.2 లక్షలకు గ్రూప్ జీవిత, ప్రమాదబీమా సౌకర్యం ఉంటుందని ఆయన అన్నారు. ఏబీ స్మార్ట్ చాయిస్ స్కీంలో 179 రోజులకు రూ.కోటి, ఆపైన నగదు డిపాజిట్ చేసిన ఖాతాదారులకు 7.80 శాతం వడ్డీ ఇస్తామన్నారు. జిల్లాలోని 107 మారుమూల గ్రామాల్లో అల్ట్రా స్మాల్ బ్యాంక్స్ నిర్వహణకు బిజినెస్ కరస్పాండెంట్లను పురమాయించామని ఆయన చెప్పారు.