: గణతంత్ర దినోత్సవాల సందర్భంగా విశాఖ తీరానికి హెచ్చరిక
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రమాదం పొంచి ఉందని విశాఖ తీరానికి నిఘవర్గాలు హెచ్చరించాయి. దీంతో తీరప్రాంత బలగాలు, రాష్ట్ర పోలీసులు అప్రమత్తంగా ఉండాలని నిఘావర్గాలు సూచించాయి. నిఘవర్గాల హెచ్చరికలతో హెచ్ పీసీఎల్, షిప్ యార్డు, డాక్ యార్డు, స్టీల్ ప్లాంట్, పోర్టు, పారిశ్రామిక ప్రాంతాలలో భద్రతను పెంచారు. విశాఖ నగరానికి మూడు వైపులా కొండలు రక్షణగా ఉంటాయి. నాలుగో వైపు మొత్తం సముద్రమే ఉంది. దీని కారణంగా గతంలో ఓ సబ్ మెరైన్ విశాఖ సముద్రజలాల్లోకి రాగలిగింది. మత్స్యకారుల అప్రమత్తతతో ఆ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగామని స్థానికులు చెబుతుంటారు. మరోసారి అలాంటి ప్రమాదం పొంచి ఉండడంతో నిఘావర్గాలు విశాఖ తీర భద్రత దళాన్ని హెచ్చరించాయి.