: గణతంత్ర వేడుకలకు భారీ భద్రత: సీపీ అనురాగ్ శర్మ
ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాదులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పారు. శుక్రవారం ఉదయం సీపీ మీడియాతో మాట్లాడారు. పరేడ్ గ్రౌండ్స్ లో 112 మంది అధికారులు, 500 మంది సిబ్బంది ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రిపబ్లిక్ డే వేడుకల దృష్ట్యా జంట నగరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వస్తాయని సీపీ అనురాగ్ శర్మ స్పష్టం చేశారు.