: అక్కినేని నా అభిమాన నటుడే కాదు.. గొప్ప వ్యక్తి: కోడి రామకృష్ణ
ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అక్కినేని సంతాపసభలో మాట్లాడారు. అక్కినేనితో తన అనుబంధాన్ని ఆయన ఈ సభలో గుర్తు చేసుకున్నారు. తాను చిన్నప్పటి నుంచి అక్కినేని వీరాభిమానినని ఆయన చెప్పారు. సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో తనకు అసిస్టెంట్ డైరెక్టర్ గా అక్కినేని అవకాశం ఇచ్చారని కోడి రామకృష్ణ తెలిపారు. ఆయన ఎప్పటికీ అభిమానుల గుండెల్లో నిల్చిపోతారని చెప్పారు. దగ్గరుండి మరీ అక్కినేని తనకు అన్నపూర్ణ స్టూడియోను చూపించారని, ఒక అభిమాని మీద ఆయన చూపించిన ప్రేమ మరువలేనిదని ఆయన పేర్కొన్నారు.