: ఫెదరర్ ఓటమి.. టైటిల్ పోరులో వావ్రింకాతో నాదల్ ఢీ
ఆస్ట్రేలియా ఓపెన్ లో మాజీ ప్రపంచ ఛాంపియన్ రోజర్ ఫెదరర్ పై వరల్డ్ మాజీ నెంబర్ వన్ రఫెల్ నాదల్ 7-6, 6-3, 6-3 తేడాతో నెగ్గాడు. తొలి సెట్లో నువ్వా? నేనా? అనేలా దిగ్గజ ఆటగాళ్లిద్దరూ హోరాహోరీ తలపడ్డారు. ఒక సర్వీసు ఫెదరర్ బ్రేక్ చేస్తే, మరో సర్వీసు నాదల్ బ్రేక్ చేస్తూ పోటాపోటీగా ఆడి అభిమానులను అలరించారు. తరువాత రెండు సెట్లలో నాదల్ సత్తా చూపడంతో, గతంలో ఆడినంత విశ్వాసంతో ఫెదరర్ ఆడలేకపోయాడు. నాదల్ మాత్రం మరోసారి ఉత్తమ పోరులో ఒత్తిడిపై విజయం సాధించి టైటిల్ పోరుకు సిద్ధపడ్డాడు. ఫైనల్ పోరులో వావ్రింకాతో నాదల్ తలపడనున్నాడు.