: జాతీయ మహిళా కమిషన్ కు ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి డుమ్మా
ఢిల్లీ న్యాయమంత్రి సోమనాథ్ భారతి జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరుకాకుండా డుమ్మా కొట్టారు. విదేశీ మహిళతో అసభ్యంగా ప్రవర్తించారనే అరోపణలపై సోమనాథ్ కు జాతీయ మహిళా కమిషన్ రెండు సార్లు సమన్లు జారీ చేసింది. దీంతో ఆయన తనకు బదులుగా న్యాయవాదిని పంపారు.