: త్రిపుర, రాజస్థాన్, ఢిల్లీకి ఎన్నికల కమిషన్ అవార్డులు
'ఉత్తమ నిర్వహణ' పేరుతో త్రిపుర, రాజస్థాన్, ఢిల్లీలకు ఎన్నికల సంఘం అవార్డులు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాలు ఎన్నికలను బాధ్యతతో సక్రమంగా నిర్వహించాయని పేర్కొన్నారు. ఈ మేరకు రేపు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేయనున్నట్లు త్రిపుర రాష్ట్ర ఎన్నికల అధికారి అశుతోష్ జిందాల్ చెప్పారు. దేశంలోని ఓటర్లకు ఎన్నికల ప్రాధాన్యతను తెలియజేసేందుకు 2011 నుంచి ప్రతి ఏడాది జనవరి 25న 'నేషనల్ ఓటర్స్ డే'ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ అవార్డులు ప్రకటించారు.