: బిల్ గేట్స్ ను బోల్తా కొట్టించిన కార్ల్ సెన్


భారత చెస్ వీరుడు.. మొన్నటి వరకు ప్రపంచ చాంపియన్ గా ఉన్న విశ్వనాథన్ ఆనంద్ ను ఓడించి సరికొత్త చాంపియన్ గా అవతరించిన మాగ్నస్ కార్ల్ సెన్.. సాఫ్ట్ వేర్ దిగ్గజం, ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ నూ బోల్తా కొట్టించాడు. తన ఎత్తులతో చిత్తు చేశాడు. స్కావ్లాన్ టీవీ షో ఇందుకు వేదికైంది. బిల్ గేట్స్ ను ఓడించే విషయంలో తనకు తాను స్వచ్చందంగా విధించుకున్న నిబంధనలను ఉల్లంఘించానని అనంతరం కార్ల్ సెన్ తెలిపాడు. బిల్ గేట్స్ బాగా ఆడారని, కానీ తాను వేసిన ఎత్తుల్లో చిక్కుకున్నారని చెప్పాడు.

  • Loading...

More Telugu News