: రాజ్యసభ ఎన్నికల్లో సమైక్య సత్తా చాటుతాం: మంత్రి గంటా
రానున్న రాజ్యసభ ఎన్నికల్లో సమైక్యవాదం సత్తా ఏంటో చూపిస్తామని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో సమైక్యవాదాన్ని వినిపిస్తామని చెప్పారు. ఏకాభిప్రాయంతో సమైక్య అభ్యర్థిని ఎన్నుకుని, రాజ్యసభ ఎన్నికల బరిలో నిలబెడతామని చెప్పారు. ఈ చర్యతో సీమాంధ్రులు సమైక్య రాష్ట్రం కోసం ఎంతగా పరితపిస్తున్నారో కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలుస్తుందని అన్నారు. శాసనసభలో టీబిల్లుపై ఓటింగ్ కు పట్టుబడతామని స్పష్టం చేశారు.