: షిండేను కలవనున్న అనూహ్య తండ్రి
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏస్తర్ అనూహ్య దారుణ హత్య కేసులో ఈ రోజు వరకు ముంబై పోలీసులు సాధించింది ఏమీ లేకపోవడం... ప్రజల్లో తీవ్ర నిరసనకు కారణమవుతోంది. ముంబైలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న అనూహ్య... ముంబై శివార్లలో అత్యాచారానికి గురై, పూర్తిగా కాలిపోయిన శరీరంతో, కుళ్లిపోయి కనిపించడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కేసులో ఈ రోజు వరకు ఒక్క అరెస్టు కూడా జరగకపోవడంతో, ముఖ్య నగరాల్లో నిరసన కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్య తండ్రి జొనాథన్ అనూహ్య ఈ రోజు కేంద్ర హోం మంత్రి షిండేను కలుస్తున్నారు. నిందితులను పట్టుకోవడంలో ముంబై పోలీసుల అలసత్వాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు.