: అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు: పోలీస్ కమిషనర్
శాసనసభ సమావేశాల నేపధ్యంలో.. అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాదు పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ప్రకటించారు. అసెంబ్లీకి రెండు కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు. ముందస్తు అనుమతి లేనిదే.. సభలు, సమావేశాలు జరిపేందుకు వీలు లేదని సీపీ అనురాగ్ శర్మ చెప్పారు. ఈ ఆంక్షలు శుక్రవారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకూ అమలులో ఉంటాయని ఆయన తెలిపారు.